వందేమాతరం పాటను తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనపై ముస్లిం సంఘాల అభ్యంతరం

  • మత స్వేచ్ఛకు విరుద్ధమన్న జమీయత్ ఉలేమా-ఏ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్
  • వందేమాతంరం పాడటంపై ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్న మౌలానా కౌసర్
  • ముస్లింలందరినీ హిందువులుగా మార్చాలనుకుంటున్నారా? అని ప్రశ్న

వందేమాతరం పాటను తప్పనిసరి చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై రాజకీయ, సామాజిక వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కొన్ని ముస్లిం సంస్థలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.


జమీయత్ ఉలేమా-ఏ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ మాట్లాడుతూ... వందేమాతరం పాటను తప్పనిసరి చేయడం రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ఇది అల్పసంఖ్యాకుల హక్కులపై ప్రతికూల ప్రభావం చూపే నిర్ణయమని అన్నారు.


ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా ఇదే అంశంపై స్పందిస్తూ విమర్శలు గుప్పించింది. ఈ సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు మౌలానా కౌసర్ హయాత్ ఖాన్ మాట్లాడుతూ... మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉన్న అంశాల కారణంగా కొందరు ముస్లింలు వందేమాతరం పాడడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. స్వాతంత్ర్యానికి ముందే ఈ అంశంపై అభ్యంతరాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. దేశంలో ఉన్న ముస్లింలందరినీ హిందువులుగా మార్చాలనుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలను బలవంతంగా అమలు చేయడం దేశానికి కూడా మంచిది కాదని వ్యాఖ్యానించారు. కొందరు వ్యక్తులు తమ భావాలను ఇతరులపై బలవంతంగా రుద్దాలనుకోవడం సరికాదని అన్నారు.



More Telugu News