సినీ నటుడు విజయ్ ప్రచార సభలో గుండెపోటుతో వ్యక్తి మృతి

  • సేలంలో టీవీకే ప్రచార సభలో విజయ్ మాట్లాడుతుండగా విషాదం
  • మృతుడిని మహారాష్ట్రకు చెందిన సూరజ్‌గా గుర్తించిన పోలీసులు
  • స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలింపు.. చికిత్స పొందుతూ మృతి
ప్రముఖ సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచార సభలో ఒక వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. తమిళనాడులోని సేలంలో జరిగిన ఎన్నికల ర్యాలీ, బహిరంగ సభకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. సభలో విజయం మాట్లాడుతుండగా ఒక వ్యక్తి స్పృహ కోల్పోయాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

మృతి చెందిన వ్యక్తిని మహారాష్ట్రకు చెందిన 37 ఏళ్ల సూరజ్‌గా గుర్తించినట్లు సేలం పోలీసులు తెలిపారు. మృతుడు సేలంలోని సెవ్వైపట్టై ప్రాంతంలో నివసిస్తున్నాడని, వెండి సంబంధిత కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడని వెల్లడించారు. అతడికి పెళ్లైందని, భార్యా, బిడ్డతో కలిసి ఉంటున్నట్లు చెప్పారు.


More Telugu News