Pakistan: ఆ భారతదేశ మ్యాప్ విడుదల చేశాక అమెరికా అధికారులను సంప్రదించాం: పాకిస్థాన్

Pakistan contacted US officials after India map release
  • జమ్ముకశ్మీర్ మొత్తం ప్రాంతాన్ని భారత భూభాగంలో చూపుతూ అమెరికా మ్యాప్ విడుదల
  • అమెరికా అధికారులను సంప్రదించి తొలగింపజేసిన పాకిస్థాన్
  • ఐక్యరాజ్య సమితి నిబంధనలకు విరుద్ధమన్న పాకిస్థాన్
జమ్ముకశ్మీర్ మొత్తం ప్రాంతాన్ని భారత భూభాగంలో భాగంగా చూపించే భారత మ్యాప్‌ను విడుదల చేసిన తర్వాత తాము అమెరికా అధికారులను సంప్రదించామని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తాహిర్ అంద్రాబి తెలిపారు. అమెరికా తొలుత విడుదల చేసిన మ్యాప్ చట్టవిరుద్ధమని, ఐక్యరాజ్యసమితి నిబంధనలకు విరుద్ధమని అన్నారు.

భారత్‌తో మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి భారత మ్యాప్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో జమ్ము కశ్మీర్ మొత్తం ప్రాంతాన్ని మన దేశంలోనే ఉన్నట్లు చూపించింది. కశ్మీర్‌లోని కొంత భాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించుకుంది. ఆక్రమించిన కశ్మీర్‌ను కూడా అమెరికా న్యాయంగా మన దేశంలోనిదిగా చూపించింది.

ఈ మ్యాప్‌‌ను అమెరికా షేర్ చేయడంతో పాకిస్థాన్ అధికారులు అగ్రరాజ్యం అధికారులతో మాట్లాడి దానిని తొలగింపజేశారు. మ్యాప్ షేర్ చేయగానే తాము అమెరికా అధికారులను సంప్రదించామని తాజాగా తాహిర్ అంద్రాబి వెల్లడించారు. కాగా, కశ్మీర్ విషయంలో భారత్ తన వైఖరిని బలంగా వినిపిస్తోంది.
Pakistan
Tahira Andrabi
India
Jammu Kashmir
America
US Map
Kashmir Map
Pakistan Foreign Ministry

More Telugu News