టీ20 వరల్డ్ కప్: పసికూన నమీబియాను కుమ్మేసిన టీమిండియా
- టీ20 ప్రపంచకప్‌లో నమీబియాపై భారత్ ఘనవిజయం
- 93 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన టీమిండియా
- అర్ధ సెంచరీలతో చెలరేగిన ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా
- మూడు వికెట్లతో సత్తా చాటిన వరుణ్ చక్రవర్తి
- 210 పరుగుల లక్ష్య ఛేదనలో 116కే కుప్పకూలిన నమీబియా
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన గ్రూప్-ఎ మ్యాచ్‌లో నమీబియాపై 93 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమగ్ర ప్రదర్శన కనబరిచిన భారత్, ప్రత్యర్థిని చిత్తుగా ఓడించింది.
210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు నమీబియా బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కేవలం 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి నమీబియా పతనాన్ని శాసించాడు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీయడంతో నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో భారత్ గ్రూప్‌లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.
అంతకుముందు, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నమీబియా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్ ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఆరంభాన్ని ఇచ్చాడు. అతనికి సంజూ శాంసన్ (8 బంతుల్లో 22) కూడా తోడవడంతో పవర్‌ప్లేలోనే భారత్ స్కోరు పరుగులు పెట్టింది. మధ్యలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ నెమ్మదిగా ఆడినా, చివర్లో హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. నమీబియా బౌలర్లలో కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ 20 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
ఈ టోర్నీలో భారత్ కు ఇది వరుసగా రెండో విజయం. తొలి మ్యాచ్ లో భారత జట్టు అమెరికాపై నెగ్గడం తెలిసిందే. ఇక, తదుపరి మ్యాచ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో భారత్ ఈ నెల 15న తలపడనుంది. శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగే ఈ మ్యాచ్ పై క్రికెట్ ప్రపంచమంతా దృష్టి సారిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలి రాజకీయ పరిణామాలతో ఈ పోరుకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.