మడకశిర ఎమ్మెల్యేను "డాకూ మహరాజ్" అని పిలిచిన బాలకృష్ణ
- అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యేలతో బాలకృష్ణ సరదా సంభాషణ
- ఎంఎస్ రాజు హంద్రీనీవా నీటిని తీసుకెళుతున్నందునే ఈ చమత్కారం
- అసెంబ్లీకి 'ప్రతిపక్షం' రాలేదంటూ వైసీపీపై పరోక్ష విమర్శలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో చమత్కారాలు, వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గురువారం సమావేశాల రెండో రోజున అసెంబ్లీ లాబీలో సహచర టీడీపీ ఎమ్మెల్యేలతో సరదాగా ముచ్చటిస్తూ, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజును ఉద్దేశించి "డాకూ మహారాజ్" అని వ్యాఖ్యానించి నవ్వులు పూయించారు.
అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బొజ్జల సుధీర్, ఎంఎస్ రాజుతో బాలకృష్ణ మాట్లాడుతుండగా ఈ సరదా సంభాషణ చోటుచేసుకుంది. హంద్రీనీవా జలాలను మడకశిరకు తీసుకెళుతున్న ఎంఎస్ రాజు 'డాకూ మహారాజ్' అయ్యారని బాలయ్య చమత్కరించారు. దీనికి ఎంఎస్ రాజు స్పందిస్తూ, వెనుకబడిన ప్రాంతమైన తమ నియోజకవర్గ నీటి అవసరాలను అర్థం చేసుకుని పెద్ద మనసు చేసుకోవాలని కోరారు.
దీనిపై బాలకృష్ణ బదులిస్తూ, హిందూపురంతో పాటు మడకశిర ప్రజలు కూడా బాగుండాలనేదే తన అభిమతమని స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుతం హిందూపురానికి మరో 10 రోజుల పాటు నీటి అవసరం ఉందని ఆయన వివరించారు.
ఇదే సమయంలో, అసెంబ్లీకి 'ప్రతిపక్షం' రాలేదంటూ వైసీపీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. దీనికి అక్కడున్న ఎమ్మెల్యేలు స్పందిస్తూ, గవర్నర్ ప్రసంగం సమయంలో హాజరైన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం 11 నిమిషాల్లోనే సభ నుంచి వెళ్లిపోయారని బదులిచ్చారు.