Donald Trump: స్విట్జర్లాండ్ పై సుంకాలు ఎందుకు విధించానంటే.. ట్రంప్ వింత వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్విట్జర్లాండ్ పై టారిఫ్ లు విధించారు. ఆ దేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తుసేవలపై 30 శాతం టారిఫ్ లు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఈ సుంకాలను 39 శాతానికి పెంచారు. అదేమని అడిగిన మీడియా ప్రతినిధులకు వింత జవాబిచ్చారు. స్విట్జర్లాండ్ పై పన్ను విధిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత తనకు ఓ ఫోన్ కాల్ వచ్చిందన్నారు. స్విస్ ప్రధాని చేశాడని భావించగా.. ఫెడరల్ కౌన్సిల్‌ సభ్యురాలు కరిన్ కెల్లర్ మాట్లాడిందని వివరించారు.

తాను విధించిన టారిఫ్ లను ప్రస్తావిస్తూ తమది చిన్న దేశమని, తమపై పన్నుల భారం మోపవద్దని రిక్వెస్ట్ చేసింది. ‘మీది చిన్నదేశమే అయినా మాతో జరుపుతోన్న వాణిజ్యంలో 42 బిలియన్ డాలర్ల మిగులు ఉంది’ అని ఆమెకు వివరించానని ట్రంప్ తెలిపారు. అయినప్పటికీ ఆమె ‘మాది చిన్నదేశం’ అని పదేపదే చెప్పింది. ఆమె మాట్లాడిన తీరు నచ్చలేదని, అందుకే సుంకాలను 30 శాతం నుంచి 39 శాతానికి పెంచానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.
Donald Trump
Switzerland
Tariffs
US Trade
Karin Keller
Swiss Federal Council
Trade War
US Economy

More Telugu News