అదానీ పరువునష్టం కేసులో జర్నలిస్టుకు జైలు
- ఏడాది కారాగారం, జరిమానా కూడా విధించిన కోర్టు
- గుజరాత్ లోని మాన్సా న్యాయస్థానం తీర్పు
- తప్పుడు కథనం, ట్వీట్లపై అదానీ గ్రూప్ కేసు
అదానీ గ్రూప్ పై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు, ట్వీట్లు చేసినందుకు ఓ జర్నలిస్టును కోర్టు జైలుశిక్ష విధించింది. ప్రజలు, పెట్టుబడిదారుల్లో తమ విశ్వసనీయతను దెబ్బతీసేలా కథనాలు రాశారంటూ జర్నలిస్ట్ రవి నాయర్ పై అదానీ గ్రూప్ క్రిమినల్ డిఫమేషన్ కేసు దాఖలు చేసింది. ఈ కేసు విచారించిన మాన్సా మేజిస్ట్రేట్.. రవి నాయర్ చేసిన ట్వీట్లు కేవలం విమర్శలు కావని, అవి కంపెనీ విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ తన వాదనలను పక్కా ఆధారాలతో నిరూపించగలిగిందని కోర్టు స్పష్టం చేసింది. రవి నాయర్ ను దోషిగా తేలుస్తూ, ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
కేసు ఏమిటంటే..
అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్) పై రవి నాయర్ గతంలో పలు ట్వీట్లు చేశారు. ఓ కథనం కూడా రాశారు. రవి నాయర్ తమ సంస్థపై తప్పుడు ప్రచారం చేశారని ఏఈఎల్ ఆరోపించింది. ఆయన ఉద్దేశపూర్వకంగా ట్వీట్లు చేసి తమ కంపెనీ ప్రతిష్టకు భంగం కలిగించారని, పెట్టుబడిదారులలో అయోమయం సృష్టించారని అదానీ గ్రూప్ పరువు నష్టం కేసు దాఖలు చేసింది.