Jitin Prasada: వరల్డ్ బ్యాంక్ ర్యాంకింగ్స్ లో భారత్ పైపైకి!

India Improves Business Environment World Bank Rankings Details by Jitin Prasada
షార్ట్స్‌లో చూడండి
వ్యాపార సౌలభ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో గత ఐదేళ్లలో భారత్ ఏకంగా 79 ర్యాంకులు మెరుగుపరుచుకుంది. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద మంగళవారం లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ గతంలో ప్రచురించిన ర్యాంకింగ్స్‌లో ఈ పురోగతి నమోదైందని ఆయన తెలిపారు.

వరల్డ్ బ్యాంక్ 2020లో 'డూయింగ్ బిజినెస్ రిపోర్ట్' (DBR)ను నిలిపివేసిందని, దాని స్థానంలో 2024లో 'బీ-రెడీ' పేరుతో కొత్త అసెస్‌మెంట్‌ను ప్రారంభించిందని మంత్రి తెలిపారు. 180 దేశాల్లో వ్యాపార జీవితచక్రంలోని 10 అంశాల ప్రాతిపదికన ఈ అంచనా ఉంటుందని చెప్పారు. 2026లో విడుదల కానున్న మూడో బీ-రెడీ నివేదికలో భారత్‌ను కూడా చేర్చనున్నట్టు ఆయన వివరించారు.

దేశంలో వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచి, పెట్టుబడులను ఆకర్షించేందుకు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (DPIIT) పలు చర్యలు చేపట్టిందని జితిన్ ప్రసాద అన్నారు. ఇందులో భాగంగా 2014లో 'వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక' (BRAP)ను ప్రారంభించినట్టు తెలిపారు. సింగిల్ విండో వ్యవస్థలు, భవన నిర్మాణ అనుమతుల సరళీకరణ, డిజిటల్ సేవలు వంటివి ఇందులో భాగమని పేర్కొన్నారు.

ఈ ప్రణాళిక కింద ఇప్పటివరకు ఏడుసార్లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరును అంచనా వేసినట్టు మంత్రి వివరించారు. దీని ద్వారా రాష్ట్రాల స్థాయిలో 9,700కు పైగా సంస్కరణలు అమలయ్యాయని తెలిపారు. అంతేకాకుండా, 2020లో ప్రారంభించిన 'నిబంధనల భారం తగ్గింపు' (R.C.B) కార్యక్రమం కింద వ్యాపారాలు, పౌరులపై భారం మోపుతున్న 47,000కు పైగా నిబంధనలను గత ఐదేళ్లలో తగ్గించినట్లు మంత్రి స్పష్టం చేశారు.
Go Back to Shorts
Jitin Prasada
India ease of doing business
World Bank rankings India
business reforms action plan
DPIIT
B-Ready report
Indian economy
ease of doing business India
BRAP
India business regulations

More Telugu News