Ambati Rambabu: జైల్లో అంబటిని పరామర్శించిన ఉండవల్లి అరుణ్ కుమార్.. చంద్రబాబుపై విమర్శలు

Undavalli Criticizes Chandrababu After Meeting Ambati Rambabu
షార్ట్స్‌లో చూడండి
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కలిశారు. ఉండవల్లితో పాటు మాజీ మంత్రి కన్నబాబు కూడా అంబటితో ములాఖత్ అయ్యారు. 

అనంతరం మీడియాతో ఉండవల్లి మాట్లాడుతూ... అంబటి రాంబాబు 1989లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేసినప్పటి నుంచి తనకు పరిచయమని చెప్పారు. ఆ వ్యక్తిగత పరిచయంతోనే అంబటిని కలిసేందుకు ములాఖత్ కు వచ్చానని తెలిపారు. రాజకీయాల్లో చంద్రబాబు కొత్త ఒరవడిని ప్రారంభించారని... తిట్టిన వాళ్లని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపిస్తూ, కొట్టిన వాళ్లకు స్టేషన్ బెయిల్ ఇస్తున్నారని అన్నారు. ఈ రకమైన సంప్రదాయం మంచిది కాదని చెప్పారు. 

తిరుమల లడ్డూ వ్యవహారంపై ఉండవల్లి మాట్లాడుతూ... తిరుమల నెయ్యిలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువని సిట్ నివేదికలో ఉందని, చాలా తక్కువ అంటే లేనట్టేనని.. కానీ, చంద్రబాబు పదేపదే జంతువుల కొవ్వు అని మాట్లాడుతున్నారని విమర్శించారు. టాయిలెట్స్ కడిగే లిక్విడ్ కూడా ఉందని అంటున్నారని... పవిత్రమైన తిరుమల లడ్డూ గురించి అలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. బీజేపీ వాళ్లు కూడా చంద్రబాబులా మాట్లాడటం లేదని... ఈ విషయంపై చంద్రబాబు పునరాలోచించుకోవాలని సూచించారు.
Go Back to Shorts
Ambati Rambabu
Undavalli Arun Kumar
Andhra Pradesh Politics
Chandrababu Naidu
Rajahmundry Central Jail
Tirumala Laddu
YSRCP
TDP
Kanna Babu
AP Politics

More Telugu News