మలయాళం నుంచి మరో మెడికల్ థ్రిల్లర్!

  • మలయాళంలో రూపొందిన 'బేబీ గర్ల్'
  • జనవరి 23న విడుదలైన సినిమా
  • 'సోనీ లివ్' చేతికి స్ట్రీమింగ్ హక్కులు  
  • ఈ నెల 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్

ఈ మధ్య కాలంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై మెడికల్ థ్రిల్లర్ కంటెంట్ కూడా పెరుగుతూ వెళుతోంది. బాలీవుడ్ .. కోలీవుడ్ నుంచి ఈ తరహా కంటెంట్ ఎక్కువగా తెరపైకి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మలయాళం నుంచి కూడా ఒక మెడికల్ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఆ సినిమా పేరే 'బేబీ గర్ల్'. నివిన్ పౌలి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, అరుణ్ వర్మ దర్శకత్వం వహించాడు. 

జనవరి 23వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. నివిన్ పౌలికి మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. ఆయన ఎంచుకునే కథలు .. పాత్రలు కొత్తగా ఉంటాయని ఆడియన్స్ భావిస్తూ ఉంటారు. అందువలన ఆయన నటించిన ఈ సినిమా కథ, అప్పుడే పుట్టిన ఒక పసిబిడ్డ చుట్టూ తిరుగుతుంది. అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'సోనీ లివ్' వారు దక్కించుకున్నారు. ఈ నెల 12 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను సోనీ లివ్ వారు ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. లిజో మోల్ జోస్ .. జాఫర్ ఇడుక్కి .. అజీజ్ .. అదితి సంగీత్ ప్రతాప్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. హీరో ఒక అటెండర్ గా పనిచేస్తున్న ఆసుపత్రిలో ఒక పసికందు అదృశ్యమవుతుంది. పర్యవసానంగా అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అప్పుడు అతను ఏం చేస్తాడు? అనేది కథ.



More Telugu News