Jaggareddy: జగ్గారెడ్డిపై సదాశివపేటలో కేసు నమోదు

Case Filed Against Jaggareddy in Sadashivpet
  • ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ జగ్గారెడ్డిపై కేసు నమోదు
  • పేదలకు, వృద్ధులకు డబ్బులు పంచారంటూ కేసు
  • రేపే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు
మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై కేసు నమోదయింది. మున్సిపల్ ఎన్నికల నియమావళిని ఉల్లగించారని ఆయనపై సదాశివపేట పీఎస్ లో కేసు నమోదు చేశారు. సదాశివపేటలోని ఓ హోటల్ వద్ద పేదలకు, వృద్ధులకు డబ్బులు పంచుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే సీఐ వెంకటేశ్ అక్కడకు చేరుకుని... అక్కడ ఉన్న జగ్గారెడ్డిని, మరికొందరు స్థానికులను అక్కడి నుంచి పంపించివేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో డబ్బులు పంచడం పట్ల పీఎస్ లో కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. 

మరోవైపు, దీనిపై జగ్గారెడ్డి అనుచరులు స్పందిస్తూ... ఆ హోటల్ వద్ద జగ్గారెడ్డికి టీ తాగే అలవాటు ఉందని... ఆయన అక్కడ ఆగిన సమయంలో తన వద్దకు వచ్చిన పేదలకు, వృద్ధులకు డబ్బులు ఇచ్చినట్టు తెలిపారు. ఈ ఘటనపై జగ్గారెడ్డి ఇంకా స్పందించాల్సి ఉంది. 

మరోవైపు, మున్సిపల్ ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సాధ్యమైనంత ఎక్కువ విజయాలను సాధించి మరోసారి సత్తా చాటాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి పూర్వవైభవాన్ని పొందే దిశగా అడుగులు వేయాలని బీఆర్ఎస్ శ్రమిస్తోంది.
Jaggareddy
Telangana Congress
Sadashivpet
Municipal Elections
Telangana Politics
Election Code Violation
Congress Party
BRS Party
Telangana
Political News

More Telugu News