Jagan: ఆ భ్రమ కల్పించేందుకే ఈ అబద్ధపు ప్రచారం: జగన్
- చంద్రబాబు ప్రభుత్వం జీఎస్‌డీపీపై తప్పుడు లెక్కలు చెబుతోందని జగన్ ఆరోపణ
- 11.75 శాతం వృద్ధి అంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని విమర్శ
- 'కాగ్' లెక్కల ప్రకారం రాష్ట్ర పన్నుల రాబడి వృద్ధి కేవలం 1.97 శాతం మాత్రమేనని వెల్లడి
- పన్నుల వసూళ్ల వృద్ధిలో 23 రాష్ట్రాల్లో ఏపీకి 22వ స్థానం లభించిందని ఎద్దేవా
- అప్పులు, అవినీతి, కక్ష సాధింపుల్లోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉందని తీవ్ర విమర్శ
వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం తప్పుడు జీఎస్‌డీపీ (స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి) గణాంకాలతో ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందనే భ్రమ కల్పించేందుకే ఈ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని జగన్ దుయ్యబట్టారు.
ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 11.75 శాతం వృద్ధి సాధించిందని, 2025-26లో ఇది 10.75 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొనడాన్ని జగన్ తప్పుబట్టారు. ఈ వృద్ధి రేటుతో దేశంలోనే మూడో స్థానంలో ఉన్నామని ప్రభుత్వం చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఈ లెక్కలు ఏ స్వతంత్ర సంస్థ ఇచ్చినవి కావని, కేవలం చంద్రబాబు కార్యాలయంలో సృష్టించినవని ఆయన విమర్శించారు.
ప్రభుత్వం చెబుతున్న వృద్ధి నిజమైతే, పన్నుల రాబడిలో కూడా అదే స్థాయి పెరుగుదల కనిపించాలని జగన్ అన్నారు. కానీ, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలలకు విడుదల చేసిన లెక్కలు ప్రభుత్వ బూటకపు ప్రచారాన్ని బట్టబయలు చేశాయని తెలిపారు. గత రెండేళ్లలో రాష్ట్ర పన్నుల రాబడి వృద్ధి సగటున కేవలం 1.97 శాతంగా మాత్రమే ఉందని, ఇది దిగ్భ్రాంతికరమని అన్నారు. "11 శాతం పైగా జీఎస్‌డీపీ వృద్ధి సాధిస్తున్న రాష్ట్రంలో పన్నుల రాబడి 2 శాతం లోపు ఎలా ఉంటుంది? ఈ వింత గణాంకాలు చూసి ప్రపంచ ఆర్థికవేత్తలు కూడా ఆశ్చర్యపోతారు" అని జగన్ ఎద్దేవా చేశారు.
ఇదే సమయంలో, దేశంలోని 23 రాష్ట్రాలకు సంబంధించిన పన్నుల రాబడి వృద్ధిపై 'కాగ్' విడుదల చేసిన గణాంకాలను జగన్ ప్రస్తావించారు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు నుంచి రెండో స్థానంలో, అంటే 22వ ర్యాంక్‌లో నిలవడం సిగ్గుచేటని అన్నారు. ఇదే చంద్రబాబు '22వ ర్యాంక్ విజన్' అంటూ ఆయన సెటైర్లు వేశారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ఏదైనా విషయంలో మొదటి స్థానంలో ఉందంటే అది అప్పులు, అవినీతి, రాజకీయ కక్ష సాధింపులు, తప్పుడు ప్రచారంలో మాత్రమేనని జగన్ తీవ్రంగా విమర్శించారు.