Gadwal Vijayalakshmi: మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ చివరి సమావేశం

Gadwal Vijayalakshmi Chairs GHMC Standing Committee Final Meeting
షార్ట్స్‌లో చూడండి
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ చివరి సమావేశం నిర్వహించారు. అజెండా అంశాల్లోని 9 ప్రతిపాదనలకు, 11 అంశాలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.

ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ, నగర కార్పొరేటర్లు, అధికారుల సమష్టి కృషితో ఐదేళ్లలో నగరాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. తన పదవీ కాలంలో కమిషనర్, అధికారులు ఎంతో సహకారం అందించారని, ఇది మరిచిపోలేనని అన్నారు. మేయర్ పదవీ కాలం పూర్తి కావడంతో విజయలక్ష్మిని ఆమె ఛాంబర్‌లో సన్మానించారు.

కాగా, ఇటీవల అహ్మదాబాద్, రాజ్‌కోట్ పురపాలక సంఘాల్లో మేయర్ ఆధ్వర్యంలో పర్యటించిన కార్పొరేటర్ల బృందం నివేదికను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌కు అందించింది. స్టాండింగ్ కమిటీ ఆమోదించిన పనులు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా కమిషనర్ కర్ణన్ అన్నారు. కార్పొరేటర్లు లేవనెత్తిన సమస్యలను చాలా వరకు పరిష్కరించామని అన్నారు.
Go Back to Shorts
Gadwal Vijayalakshmi
GHMC
Hyderabad
Standing Committee Meeting
RV Karnan
Municipal Corporation

More Telugu News