Medaram Jatara: మేడారం హుండీల లెక్కింపు... ఐదు రోజుల్లో రూ.11.83 కోట్ల ఆదాయం

మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు కొనసాగుతోంది. నేటితో హుండీల లెక్కింపు ఐదో రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు 788 హుండీలను లెక్కించగా రూ.11.83 కోట్ల ఆదాయం వచ్చింది. ఈరోజు 163 హుండీలను లెక్కించగా రూ.1.12 కోట్ల ఆదాయం సమకూరింది. మిగిలిన హుండీల లెక్కింపునకు సుమారు రెండు రోజులు పట్టవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు.

మంత్రి కొండా సురేఖ గత గురువారం కొబ్బరికాయ కొట్టి హుండీల లెక్కింపును ప్రారంభించారు. క్రితంసారి మేడారం జాతర ద్వారా రూ.13 కోట్ల ఆదాయం సమకూరింది. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో లెక్కిస్తున్నారు. హుండీల లెక్కింపు పూర్తయ్యాక బంగారం, వెండి వస్తువుల విలువను నిర్ధారిస్తారు.
Medaram Jatara
Sammakka Saralamma Jatara
Medaram Hundis
Konda Surekha
Telangana Temples

More Telugu News