Asaduddin Owaisi: ఎంఐఎం మద్దతు లేకుండా కాంగ్రెస్ గెలిచిందా?: ఒవైసీ

Did Congress win without MIM support asks Owaisi
  • రెడ్లు అయినా, రావులు అయినా తమ దగ్గరకు రావాల్సిందే అన్న ఒవైసీ
  • మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపుతామని వ్యాఖ్య
  • ముఖ్యమంత్రులే తమ దగ్గరకు రావాలన్న ఒవైసీ
రెడ్లు అయినా, రావులు అయినా తమ దగ్గరకు రావాల్సిందేనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రుల దగ్గరకు తాము వెళ్లమని, వాళ్లే తమ దగ్గరకు రావాలని అన్నారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎంఐఎం మద్దతు లేకుండానే కాంగ్రెస్ గెలిచిందా? అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం సత్తా ఏమిటో చూపుతామని అన్నారు. 

మరోవైపు అసోం సీఎం హిమంత బిశ్వపై హైదరాబాద్ పోలీసులకు ఒవైసీ ఫిర్యాదు చేశారు. ముస్లింలను కాల్చుతున్నట్టుగా ఉన్న వీడియోను పోస్టు చేసినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని ఒవైసీ అన్నారు. ముస్లింలను రెచ్చగొట్టేందుకు దురుద్దేశపూర్వకంగా ఈ వీడియోను హిమంత పోస్టు చేశారని మండిపడ్డారు. జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించేలా ఆయన తీరు ఉందని విమర్శించారు. 


Asaduddin Owaisi
MIM
Congress
Jubilee Hills byelection
Telangana politics
Hyderabad
Himanta Biswa Sarma
Assam CM
Muslims
Municipal elections

More Telugu News