Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు

Ambati Rambabu Faces 14 Day Remand in Medical College Protest Case
Advertisement
  • పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఆందోళన
  • ఆ సందర్భంగా పోలీసు విధులకు ఆటంకం కలిగించిన అంబటి
  • 14 రోజుల రిమాండ్ విధించిన స్పెషల్ జ్యుడీషియల్ కోర్టు
Advertisement
ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును దుర్భాషలాడిన కేసులో రిమాండ్ లో ఉన్న వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు మరో కేసులో షాక్ తగిలింది. మెడికల్ కాలేజీని పీపీపీ విధానంలో నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ చేసిన ఆందోళన కార్యక్రమం సందర్భంగా... బ్యారికేడ్లను తోసివేసి, పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే కేసులో ఆయనకు స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మరోవైపు, చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై గుంటూరు మొబైల్ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ విచారణ అనంతరం ఆయనను తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.  
Advertisement
Advertisement
Ambati Rambabu
Andhra Pradesh
YSRCP
Chandrababu Naidu
Guntur
Remand
Medical College Protest

More Telugu News