సంక్షేమం నుంచి అభివృద్ధి వరకు.. ప్రభుత్వ ప్రగతి నివేదిక ఇదే: సీఎం చంద్రబాబు
- 204 అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణతో పేదల ఆకలి తీరుస్తున్నామన్న సీఎం చంద్రబాబు
- రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులతో 23 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని ప్రకటన
- మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీ పూర్తి చేశామన్న ముఖ్యమంత్రి
- గత ప్రభుత్వ హయాంలో పోలవరం డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైందని విమర్శ
- 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్న చంద్రబాబు
సంక్షేమ పథకాల అమలు నుంచి భారీ పెట్టుబడుల ఆకర్షణ వరకు తమ ప్రభుత్వ పాలన దార్శనికతను, భవిష్యత్ లక్ష్యాలను ముఖ్యమంత్రి సమగ్రంగా వివరించారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూనే, గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను, అధికార దుర్వినియోగాన్ని ఎండగట్టారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించామని, గత ప్రభుత్వం వీటిని రద్దు చేసి పేదవాడి కడుపు కొట్టిందని విమర్శించారు.
గత పాలనలో జరిగిన భూ అక్రమాలపై ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. "తాడేపల్లి ప్యాలెస్ వద్ద హెలిపాడ్ కోసం ఒక ప్రైవేటు భూమిని అక్రమంగా 22ఏ నిబంధన కింద చేర్చారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ స్థాయిలో అధికారాన్ని దుర్వినియోగం చేయడం దారుణం. ఇది కేవలం తాడేపల్లికే పరిమితం కాలేదు, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటివి జరిగాయి" అని వ్యాఖ్యానించారు. దీనికి పరిష్కారంగానే భూవివాదాలు లేని పకడ్బందీ సర్వే ప్రక్రియను చేపట్టామని, క్యూఆర్ కోడ్, ఇతర భద్రతా ఫీచర్లతో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు.
2027 నాటికి పోలవరం పూర్తి.. 20 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
రాష్ట్ర అభివృద్ధికి నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరిస్తూ, పోలవరం ప్రాజెక్టును 2027 పుష్కరాల నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. రూ.440 కోట్లతో నిర్మించిన డయాఫ్రమ్ వాల్‌ను గత పాలకులు ధ్వంసం చేయడం వల్ల, ఇప్పుడు దాని పునర్నిర్మాణానికి అదనంగా రూ.1000 కోట్లు ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు శ్మశానం, ఎడారి అని విమర్శించిన అమరావతిని వచ్చే మూడేళ్లలో దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా (మోస్ట్ లివబుల్ సిటీ) తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.
ఉద్యోగాల కల్పన, పారిశ్రామిక ప్రగతిపై మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను, 5,757 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 23 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ, విశాఖలో గూగుల్ డేటా సెంటర్, కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులతో ఏపీ రూపురేఖలు మారనున్నాయని అన్నారు.
అధికారులంతా టీమ్ స్పిరిట్‌తో పనిచేసి, ప్రభుత్వ పాలన ప్రజలకు వేగంగా అందేలా చూడాలని (స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్) పిలుపునిచ్చారు. రైతుల కోసం మార్కెట్ జోక్యం, ధాన్యం కొనుగోళ్లకు తక్షణ చెల్లింపులు, రోడ్ల నిర్మాణం, ఇంటింటికీ కుళాయి, యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ వంటి పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. 2026-27 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేలా కార్యాచరణ ఉండాలని అధికారులను ఆదేశించారు.