Andhra Pradesh Accident: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం... ముగ్గురు ఏపీ వాసుల దుర్మరణం

Andhra Pradesh Accident Three Died in Karnataka Road Accident
  • కర్ణాటకలోని కోలారు జిల్లా శ్రీనివాసపురం క్రాస్ రోడ్డు వద్ద ఘటన 
  • చింతకాయలు కోయడానికి కర్ణాటక వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా ప్రమాదానికి గురైన వైనం
  • మృతులు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం పూలకుంటవారిపల్లెకు చెందిన వారుగా గుర్తింపు
కర్ణాటకలోని కోలారు జిల్లా శ్రీనివాసపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీనివాసపురం క్రాస్‌ వద్ద మలుపు వద్ద ఆదివారం రాత్రి బొలేరో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు కూలీలు మృతి చెందగా, మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని శ్రీనివాసపురం, మదనపల్లె, రాయల్పాడు ఆసుపత్రులకు తరలించారు. 

ప్రమాదంలో అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం పూలకుంటవారిపల్లెకు చెందిన శ్రీనివాసులు (25), వెంకటమ్మ (65), పాతూరు గ్రామానికి చెందిన మునెప్ప (61) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మునెప్ప ఘటనాస్థలిలోనే మృతి చెందగా, శ్రీనివాసులు, వెంకటమ్మలను ఆసుపత్రులకు తరలించే క్రమంలో మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. 

మృతులు, గాయపడిన వారంతా చింతకాయలు కోయడానికి కర్ణాటకకు వెళ్లిన కూలీలుగా సమాచారం. పనులు ముగించుకుని స్వగ్రామాలకు తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
Andhra Pradesh Accident
Karnataka Road Accident
Road Accident
Srinivasapuram
Kolar District
Annamayya District
Chintakayala Koyadam
Andhra Pradesh Workers

More Telugu News