Chiranjeevi: 'రుద్ర' పుస్తకాన్ని ఆవిష్కరించిన చిరంజీవి...కృతజ్ఞతలు తెలిపిన కొండా సురేఖ

Chiranjeevi Launches Rudra Book by Konda Susmitha Patel
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 'రుద్ర' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ ఈ పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకావిష్కరణ విషయాన్ని మంత్రి కొండా సురేఖ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఆధ్యాత్మిక విలువలు, సాంస్కృతిక వారసత్వాన్ని యువతకు చేరువ చేసేలా ఈ పుస్తకాన్ని రూపొందించడం సంతోషంగా ఉందన్నారు. నేటి తరానికి ఇటువంటి విలువైన పుస్తకాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. రచయిత్రి సుస్మిత పటేల్ ప్రయత్నాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

పుస్తకావిష్కరణకు అంగీకరించిన మెగాస్టార్ చిరంజీవికి మంత్రి కొండా సురేఖ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. "నేటి యువతకు ఆదర్శంగా నిలిచేలా, శివ పురాణంపై అవగాహన కలిగించాలనే ఉన్నత లక్ష్యంతో ఈ పుస్తకాన్ని రచించిన కొండా సుస్మితకు హృదయపూర్వక శుభాకాంక్షలు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని గొప్ప రచనలు చేయాలని ఆకాంక్షిస్తున్నాం" అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. 

యువతను లక్ష్యంగా చేసుకుని, శివపురాణంలోని విశేషాలను వారికి సులభంగా తెలియజేయాలనే సంకల్పంతో ఈ పుస్తకాన్ని రచించినట్లు తెలుస్తోంది.
Go Back to Shorts
Chiranjeevi
Rudra Book
Konda Surekha
Konda Susmitha Patel
Telugu Books
Book Launch
Shiva Purana
Telangana
Spiritual Books

More Telugu News