గొలుసు దొంగగా మారిన బిజినెస్ మ్యాన్.. పట్టిచ్చిన షూస్

Mohan Kokate Mumbai businessman turned chain snatcher arrested
  • సంపన్న కుటుంబంలో పుట్టి చైన్ స్నాచర్ గా మారిన వైనం
  • ఆన్ లైన్ జూదం వ్యసనంతో అప్పులపాలైన బిజినెస్ మ్యాన్
  • అప్పులు తీర్చేందుకు దొంగతనాలు చేస్తున్నట్లు వెల్లడి
సంపన్న కుటుంబంలో పుట్టినా చెడు అలవాట్ల వల్ల ఓ వ్యక్తి అప్పుల పాలై, ఆ అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచర్ గా మారాడు. మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు ఎత్తుకెళ్లేవాడు. ఎప్పటికప్పుడు దుస్తులు మార్చేసి పోలీసులకు దొరకకుండా తప్పించుకోవాలని ప్రయత్నించాడు. దుస్తులు మార్చినా కూడా తను వేసుకున్న షూ మార్చకపోవడంతో పోలీసులకు దొరికిపోయాడు. ముంబైలో వరుస దొంగతనాలకు పాల్పడిన ఓ చైన్ స్నాచర్ ను అతడు వేసుకున్న షూ పట్టించాయి.

వివరాల్లోకి వెళితే.. ముంబైలోని సియాన్ ఏరియాకు చెందిన మోహన్ కొకాటే (49) గతంలో గార్డెనింగ్ వ్యాపారం చేస్తుండేవాడు. అతడి కుటుంబంలో అందరూ ఉన్నత విద్యావంతులే... పెద్ద పెద్ద హోదాలో ఉన్నవారే. మోహన్ మాత్రం ఆన్ లైన్ జూదానికి బానిసయ్యాడు. జూదం ఆడేందుకు విపరీతంగా అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు చైన్ స్నాచర్ అవతారమెత్తాడు. 

కొన్ని నేరపూరిత చర్యల కారణంగా అతడు 2011లో జైలుకు కూడా వెళ్లాడు. బయటికి వచ్చాక కొంతకాలం నేరాలకు దూరంగా ఉన్నప్పటికీ అప్పుల కారణంగా దొంగగా మారాడు.

దొంగిలించిన బైక్ పై ప్రయాణిస్తూ మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు ఎత్తుకెళ్లేవాడు. ముఖానికి హెల్మెట్ ధరించడం, ఎప్పటికప్పుడు దుస్తులు మార్చడంతో మోహన్ ను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. దొంగతనాలు జరిగిన ప్రాంతాల్లోని 80 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. దొంగతనం జరిగిన ప్రతిచోటా దొంగ వేర్వేరు దుస్తుల్లో కనిపించాడు. అయితే, అన్నిచోట్లా ఒకే రకమైన షూ ధరించాడు. ఈ క్లూ ఆధారంగా పరిశోధన జరిపిన పోలీసులు.. దొంగిలించిన బైక్ ను ఓ ప్రాంతంలో వదిలేసి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా మోహన్ ను గుర్తించి అరెస్టు చేశారు.
Advertisement
Mumbai chain snatcher
chain snatching
online gambling
Mohan Kokate
crime news
Mumbai crime
Sion area
gold chain theft
Maharashtra police
CCTV footage

More Telugu News