Mehul Choksi: ‘కిడ్నాప్’ కు ఆధారాల్లేవు.. చోక్సీకి షాక్ ఇచ్చిన యూకే కోర్టు

Mehul Choksi Faces Setback as UK Court Questions Kidnap Story
షార్ట్స్‌లో చూడండి
పంజాబ్ నేషనల్ బ్యాంకు మోసం కేసులో విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి యూకే కోర్టు షాకిచ్చింది. ఆయన చెబుతున్న ‘కిడ్నాప్’ ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని పేర్కొంది. చోక్సీ ఆరోపణలే తప్ప ఆయన కిడ్నాప్ కావడం ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరూ లేరని చెప్పింది. చోక్సీ లాయర్ చూపించిన సందర్భోచిత సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుని విచారణ సాగిస్తామని పేర్కొంటూ.. రూ.7.3 కోట్లు సెక్యూరిటీ బాండ్ కోర్టుకు సమర్పించాలని చోక్సీని ఆదేశించింది.

కేసు ఏంటంటే..
విదేశాలకు పారిపోయిన మెహుల్ చోక్సీ కొంతకాలం ఆంటిగ్వాలో తలదాచుకున్నాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకు మోసం కేసులో తనను భారత్ కు తరలించేందుకు కొంతమంది కుట్ర పన్నారని చోక్సీ ఆరోపించారు. హంగేరీకి చెందిన బార్బారా జబారికతో కలిసి భారత ఏజెంట్లు తనను కిడ్నాప్ చేశారని యూకే కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జబారిక తనతో స్నేహం నటించి ఆంటిగ్వా నుంచి బలవంతంగా డొమినికాకు తీసుకెళ్లిందని, తప్పించుకుని బయటపడిన తనను బెల్జియం పోలీసులు అరెస్టు చేశారని చోక్సీ చెప్పాడు.
Go Back to Shorts
Mehul Choksi
PNB Scam
Punjab National Bank
UK Court
Extradition
Antigua
Kidnapping Allegations
Barbara Jabarica
Dominica

More Telugu News