డబ్ల్యూపీఎల్ 2026 ఛాంపియన్‌గా ఆర్సీబీ.. ‘చరిత్ర రిపీట్ అయింది’ అన్న అనుష్క శర్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డబ్ల్యూపీఎల్ 2026 ఛాంపియన్‌గా ఆర్సీబీ.. ‘చరిత్ర రిపీట్ అయింది’ అన్న అనుష్క శర్మ

Anushka Sharma Reacts to RCB WPL 2026 Victory History Repeats
  • డబ్ల్యూపీఎల్ 2026 ఫైనల్లో ఢిల్లీపై ఆర్సీబీ గెలుపు
  • ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన బెంగళూరు జట్టు
  • ఇది ఆర్సీబీ మహిళల జట్టుకు రెండో టైటిల్
  • ఆర్సీబీ విజయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న అనుష్క
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 టైటిల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కైవసం చేసుకుంది. నిన్న‌ జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి విజేతగా నిలిచింది. ఆర్సీబీ మహిళల జట్టుకు ఇది రెండో డబ్ల్యూపీఎల్ టైటిల్‌ కావడం విశేషం.

ఈ విజయంపై నటి అనుష్క శర్మ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని పంచుకున్నారు. ఆమె భర్త విరాట్ కోహ్లీ ఆర్సీబీ పురుషుల జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్సీబీ మహిళల జట్టు ట్రోఫీని అందుకున్న ఫొటోను అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. "ఆర్సీబీ మహిళలు మళ్లీ చేశారు. చరిత్ర పునరావృతమైంది" అని దానికి క్యాప్షన్ జోడించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఇక‌, ఇటీవల అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ దంప‌తులు లండన్‌లోని తమ నివాసంలో పూజ నిర్వహించారు. పూజారి పక్కన ఈ జంట కూర్చున్న ఫొటో ఒకటి ఆన్‌లైన్‌లో కనిపించింది. ఇందులో అనుష్క తెల్లటి కార్డిగాన్, ఆరెంజ్ స్కర్ట్‌లో ఉండగా, విరాట్ తెల్లటి కుర్తాలో ఉన్నాడు. లండన్ ఇంట్లో వారు ఈ మతపరమైన కార్యక్రమం జరిపినట్టు సమాచారం.

Advertisement
Anushka Sharma
WPL 2026
Royal Challengers Bangalore
RCB
Delhi Capitals
Virat Kohli
Womens Premier League
Cricket
Anushka Virat London Pooja

More Telugu News