Deepak Chopra: 'స్పిరిచువల్ గురు' దీపక్ చోప్రాపై లైంగిక ఆరోపణలు.. ఎప్‌స్టీన్ కేసుతో మరో మలుపు!

Deepak Chopra facing sexual allegations linked to Epstein case
  • అగ్రశ్రేణి ఆధ్యాత్మిక గురువుపై వేధింపుల ఆరోపణ
  • సోషల్ మీడియాలో సెవ్దా రూబెన్స్ పోస్ట్ వైరల్
  • ఎప్‌స్టీన్‌తో తనకు పరిమితమైన సంబంధాలే ఉండేవన్న దీపక్ చోప్రా
  • తన పోస్ట్‌కు ఎవరూ రిప్లై ఇవ్వకుండా ఆప్షన్‌ను డిసేబుల్ చేయడంపై అనుమానాలు
ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక వేత్త, వెల్నెస్ ఐకాన్ దీపక్ చోప్రా తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. కళాకారిణి, పారిశ్రామికవేత్త సెవ్దా రూబెన్స్ చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. దాదాపు 19 లక్షల మంది వీక్షించిన ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో.. తనకు 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఐరోపాలో జరిగిన ఒక ధ్యాన కార్యక్రమంలో చోప్రా తనతో అసభ్యంగా ప్రవర్తించారని రూబెన్స్ ఆరోపించారు.

సెవ్దా రూబెన్స్ కథనం ప్రకారం.. ఆ కార్యక్రమంలో చోప్రా ఆమెకు తన వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇచ్చి, అర్ధ రాత్రి ఏకాంతంగా కలవాలని కోరారని తెలిపారు. "పురుష గురువులు ఒక కల్పితం.. తెలివైన అమ్మాయిలే వాస్తవం" అంటూ ఆమె చేసిన వ్యాఖ్య ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తను ఒంటరిగా ఉంటూ, తన రక్షణ కోసం నిరంతరం అప్రమత్తంగా ఉండే దానినని, అందుకే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగానని ఆమె పేర్కొన్నారు.

 ఈ ఆరోపణలు వచ్చిన సమయంలోనే  జెఫ్రీ ఎప్‌స్టీన్ (వివాదాస్పద ఫైనాన్షియర్) కేసులో విడుదలైన తాజా పత్రాల్లో దీపక్ చోప్రా పేరు బయటపడటం కలకలం రేపుతోంది. 2016 నుంచి 2019 మధ్య కాలంలో వీరిద్దరి మధ్య జరిగిన ఈమెయిల్ సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. అందులో "దేవుడు ఒక భ్రమ.. అందమైన అమ్మాయిలే నిజం" వంటి వ్యాఖ్యలు చోప్రా పబ్లిక్ ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా ఉండటంతో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఈ వివాదంపై దీపక్ చోప్రా ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఎప్‌స్టీన్‌తో తనకు పరిమితమైన సంబంధాలే ఉండేవని, ఏ విధమైన అసాంఘిక కార్యకలాపాల్లో తాను పాల్గొనలేదని స్పష్టం చేశారు. అయితే, గతంలో తాను చేసిన కొన్ని వ్యాఖ్యల శైలి సరిగా లేదని, అందుకు చింతిస్తున్నానని పేర్కొన్నారు. విశేషమేమిటంటే, ఈ పోస్ట్‌కు ఎవరూ రిప్లై ఇవ్వకుండా ఆయన ఆప్షన్‌ను డిసేబుల్ చేయడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. సెవ్దా రూబెన్స్ చేసిన ఆరోపణలపై ఆయన ఇప్పటికీ నేరుగా స్పందించకపోవడం గమనార్హం.
Deepak Chopra
Sevda Rubens
Jeffrey Epstein
sexual allegations
spiritual guru
wellness icon
meditation program
social media
email conversations
controversy

More Telugu News