Ram Charan: రామ్ చరణ్ 'పెద్ది' రిలిజ్ డేట్ మారింది!

Ram Charan Peddi Movie Release Date Changed
  • మార్చి నుంచి ఏప్రిల్‌కు వాయిదా పడిన 'పెద్ది'
  • ఏప్రిల్ 30... కొత్త రిలీజ్ డేట్ ప్రకటన
  • మే డే వీకెండ్‌ను టార్గెట్ చేసిన చిత్రబృందం
  • బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా సినిమా
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం 'పెద్ది' విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది.  ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్ర దర్శకుడు బుచ్చి బాబు సానా అధికారికంగా ప్రకటించారు.

వాస్తవానికి ఈ చిత్రాన్నిమార్చి 27న విడుదల చేయాలని భావించారు. పవన్ కల్యాణ్ కొత్త చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' మార్చి 26న వస్తున్నట్టు ఇవాళ ప్రకటించిన నేపథ్యంలో, 'పెద్ది' విడుదల తేదీని వెనక్కి జరిపినట్టు తెలుస్తోంది.

అయితే, కొత్త విడుదల తేదీ మే డే వీకెండ్‌తో కలిసి వస్తుండటంతో సమ్మర్ సీజన్‌లో సినిమాకు ఇది బాగా కలిసొస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. “అతడి రాక తేదీ మారుతుంది, కానీ అతడి దృఢ సంకల్పం మారదు” అంటూ చిత్రబృందం చేసిన ప్రకటన అభిమానుల్లో సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

గ్రామీణ క్రీడా నేపథ్యంతో కూడిన యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ టైటిల్ రోల్‌లో కనిపించనున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి.

More Telugu News

Ram Charan
Peddi Movie
Buchi Babu Sana
Janhvi Kapoor
Shivrajkumar
AR Rahman
Telugu Cinema Release Date
Pan India Movie
Usthad Bhagat Singh
Tollywood