టీ20 వరల్డ్ కప్ పై ధోనీ ఏమన్నారంటే..!
- ఈసారి అన్నీ ప్రమాదకరమైన జట్లే ఆడుతున్నాయన్న ధోనీ
- టీమ్ ఇండియా మరింత ప్రమాదకరమైన జట్టని వ్యాఖ్య
- పొట్టి ఫార్మాట్ లో ఆటగాళ్లపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని వెల్లడి
టీ20 ప్రపంచ కప్ ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న ఈ పొట్టి ప్రపంచకప్ విజేతగా నిలవబోయే జట్టు ఏదనే దానిపై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ధోనీ మాట్లాడుతూ భారత జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవేనని చెప్పారు.
అయితే, అన్ని జట్లలోకి భారత్ మరింత ప్రమాదకరమైన జట్టు అని, మన కుర్రాళ్లు అద్భుతమైన ఫామ్ లో ఉన్నారని చెప్పారు. పొట్టి ఫార్మాట్ లో ఆటగాళ్లపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, భారత జట్టులోని ఆటగాళ్లు అందరికీ ఒత్తిడిలో ఆడిన అనుభవం పుష్కలంగా ఉందని అన్నారు. ఎవరు ఏ పాత్ర పోషించాలో జట్టులోని సభ్యులకు స్పష్టంగా తెలుసని ధోనీ చెప్పారు. మంచి జట్టుకు ఉండాల్సిన లక్షణాలన్నీ టీమ్ ఇండియాలో ఉన్నాయని వివరించారు.
అదే భయపెడుతోంది..
మ్యాచ్ జరిగే వేదికల్లో వాతావరణం తనను కలవరపరుస్తోందని ధోనీ చెప్పారు. శీతాకాలం కావడంతో కొన్ని నగరాల్లో మంచు కురుస్తోందని, మ్యాచ్ పై దీని ప్రభావం చాలా ఉంటుందని వివరించారు. ఇది చాలా విషయాలను ప్రభావితం చేస్తుందని, తాను ఆడుతున్న సమయంలోనూ డ్యూ (మంచు) అంటే భయాందోళనలకు గురయ్యానని చెప్పారు. ఇలాంటి సమయంలో టాస్ కీలక పాత్ర పోషిస్తుందని ధోని చెప్పుకొచ్చారు.