జైలులో అంబటి నిద్రకు ప్రత్యేక పరికరం
- నిద్రలో శ్వాస సంబంధిత సమస్య ఉన్న అంబటి రాంబాబు
- కోర్టు ఆదేశాలతో స్లీప్ అప్నియా పరికరాన్ని అందించిన జైలు అధికారులు
- ప్రత్యేక పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి రాంబాబు
అంబటి రాంబాబుకు స్లీప్ అప్నియా సమస్య ఉండటంతో ఆయన ప్రత్యేక పరికరం సాయంతో నిద్రిస్తున్నారు. శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వారు దీనిని ఉపయోగిస్తారని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాలు ఉన్న వారిలో నిద్రిస్తున్న సమయంలో కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకునే స్థాయి బాగా తగ్గిపోయి, మళ్లీ కాసేపటికి పునరుద్దరణ అవుతుంది. ఆ సమయంలో శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోకుండా ఈ పరికరం ఉపయోగపడుతుంది.
ఈ సమస్య ఎప్పుడు తలెత్తుతుందో ముందుగా అంచనా వేయడం కష్టం కావడంతో నిద్రకు ముందు నుంచే పరికరాన్ని అమర్చుకుని నిద్రిస్తారని వైద్యులు వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకే అంబటి రాంబాబుకు ఈ స్లీప్ అప్నియా పరికరాన్ని అందించినట్లు జైలు అధికారులు తెలిపారు.