Rahul Gandhi: లోక్‌సభలో 'యార్' అని సంభోదించిన సభ్యుడు.. ప్యానెల్ స్పీకర్ మందలింపు

Rahul Gandhi Lok Sabha Disruption Member Calls Speaker Yar
  • భారత ఆర్మీ మాజీ చీఫ్ నరవణే ఆత్మకథలోని అంశాలను ప్రస్తావించిన రాహుల్ గాంధీ
  • రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యుల అభ్యంతరం
  • ప్యానెల్ స్పీకర్‌ను ఉద్దేశించి 'యార్' అని సంభోదించిన విపక్ష సభ్యుడు
లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యుడు ఒకరు ప్యానల్ స్పీకర్‌ను ఉద్దేశించి 'యార్' అని సంభోదించడం సభలో కాస్త గందరగోళానికి కారణమైంది. భారత ఆర్మీ మాజీ చీఫ్ నరవణే రాసిన ఆత్మకథలోని అంశాలను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈరోజు కూడా ప్రస్తావించారు. దీంతో లోక్ సభ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది.

రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న సమయంలో అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో విపక్ష సభ్యుల్లో నుంచి ఒకరు ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్‌ను ఉద్దేశించి 'యార్' అని సంభోదించారు.

ఇలా 'యార్' అనడం ఏమిటి... ఇది పార్లమెంట్... సభాపతి స్థానంలో ఉన్న వ్యక్తిని అలా సంభోదించడం సరికాదని ప్యానెల్ స్పీకర్ మందలించారు. అలా మాట్లాడటం సభా మర్యాదకు వ్యతిరేకమని తెలిపారు. వెంటనే మీ మాటలను వెనక్కి తీసుకోవాలని సూచించారు.

More Telugu News

Rahul Gandhi
Lok Sabha
Tenneti Krishna Prasad
Parliament
Indian Army
Panel Speaker
proceedings