పాకిస్థాన్ జట్టు బలహీనంగా ఉంది.. ఏదో చిన్న జట్టుతో ఆడుతున్నట్లు ఉంది: భారత మాజీ క్రికెటర్

  • పాక్‌తో మ్యాచ్ జరిగినప్పుడు ఇదివరకు ఉన్నటువంటి మజా రావడం లేదని వ్యాఖ్య
  • ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా ఉందని వ్యాఖ్య
  • పాకిస్థాన్ జట్టు 90వ దశకంలో ఉన్నట్లు ఇప్పుడు లేదన్న సంజయ్ మంజ్రేకర్
ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు చాలా బలహీనంగా ఉందని, టీమిండియాకు సరైన పోటీ ఇచ్చే పరిస్థితిలో లేదని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగకపోయినా పర్వాలేదని... పాక్ జట్టు బలహీనంగా ఉండటంతో ఈ రెండు జట్ల మ్యాచ్ జరిగినప్పుడు ఇదివరకు ఉన్నటువంటి మజా రావడం లేదని వ్యాఖ్యానించాడు.

పాకిస్థాన్‌తో మ్యాచ్ కంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో తలపడుతుంటే ఉత్కంఠభరితంగా ఉందని అన్నాడు. చాలాకాలంగా భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లు రసవత్తరంగా సాగడం లేదని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.

దాయాదుల సమరంలో పూర్తి ఏకపక్షంగా ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నాడు. పాకిస్థాన్ జట్టు 90వ దశకంలో ఉన్నట్లు ప్రస్తుతం లేదని అన్నాడు. ఇప్పుడు ఆ జట్టు చాలా బలహీనంగా ఉందని తెలిపాడు. పాకిస్థాన్‌తో తలపడుతుంటే ఏదో చిన్న జట్టుతో మ్యాచ్ ఆడుతున్నట్లుగా ఉందని అన్నాడు.


More Telugu News

Sanjay Manjrekar India vs Pakistan Pakistan Cricket Team Cricket India Cricket Cricket Match