హైదరాబాద్ రైల్వే హబ్ కాబోతుంది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

  • వికసిత్ భారత్ 2047 కోసం పెట్టిన బడ్జెట్ అన్న కిషన్ రెడ్డి
  • ఉచిత పథకాల కోసమే బడ్జెట్ అన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
  • ప్రజలు ఆశిస్తున్న సుస్థిర ప్రగతికి దోహదపడేలా బడ్జెట్ ఉందన్న కిషన్ రెడ్డి
హైదరాబాద్ రైల్వే హబ్ కాబోతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2026-27 బడ్జెట్ ఎన్నికల కోసం కాకుండా వికసిత్ భారత్-2047 కోసం తీసుకువచ్చిన బడ్జెట్ అన్నారు. ఉచితాలు ప్రవేశపెట్టడం కోసమే బడ్జెట్ అన్నట్లుగా రాజకీయ పార్టీలు ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఆశిస్తున్న సుస్థిర ప్రగతికి దోహదపడేలా బడ్జెట్ ఉందని అన్నారు.

వీబీ జీ రామ్ జీ ద్వారా ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేశారని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఈ పథకానికి బడ్జెట్‌లో 9 శాతం నిధులు కేటాయించినట్లు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 4.30 లక్షల ఇళ్లు కేటాయించామని, మేడారం జాతరకు కేంద్రం రూ.3.70 కోట్లు కేటాయించిందని అన్నారు.

నైనీ బొగ్గు బొగ్గు గనుల వ్యవహారంలో తెలంగాణ మంత్రులు రెండు వర్గాలుగా విడిపోయారని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ దగా వల్లే సింగరేణి భ్రష్టు పట్టిందని ఆరోపించారు. సింగరేణిని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా కేసీఆర్ మార్చుకున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ తన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చుకుందని విమర్శించారు.


More Telugu News

Kishan Reddy Hyderabad Railway Hub Union Minister Budget 2026-27 Vikshit Bharat 2047 MGNREGA