హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు కొత్త అధ్యక్షుడి నియామకం

  • నూతన అధ్యక్షుడిగా అమర్నాథ్ నియామకం
  • అక్రమ ఓటింగ్ ఆభియోగాలతో పదవి కోల్పోయిన జగన్మోహన్ రావు
  • వారంలోగా అమర్నాథ్ బాధ్యతలు చేపట్టాలని అంబుడ్స్ మన్ ఆదేశం
పలు సమస్యలు, వివాదాల్లో కూరుకుపోయిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)కు కొత్త అధ్యక్షుడు వచ్చారు. గెలాక్సీ క్లబ్ కు చెందిన అమర్నాథ్ హెచ్సీఏ నూతన అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 

గతంలో హెచ్సీఏకి జరిగిన ఎన్నికల్లో కేవలం ఒక ఓటు తేడాతో జగన్మోహన్ రావు గెలిచారు. జగన్మోహన్ రావుకి 63 ఓట్లు రాగా... అమర్నాథ్ కు ఒక ఓటు తక్కువగా 62 ఓట్లు వచ్చాయి. దీంతో, హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు బాధ్యతలు చేపట్టారు. అయితే, శ్రీచక్ర అనే క్రికెట్ క్లబ్ ను సృష్టించి అక్రమ ఓటింగ్ కు పాల్పడినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు... ఆయనను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయనను అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. 

అప్పటి నుంచి హెచ్సీఏ వ్యవహారాలను హెచ్సీఏ అంబుడ్స్ మన్ రిటైర్ట్ జస్టిస్ సురేశ్ కుమార్ నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా హెచ్సీఏ అధ్యక్షుడిగా అమర్నాథ్ ను నియమిస్తూ అంబుడ్స్ మన్ తీర్పును వెలువరించారు. వారంలోని అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు.


More Telugu News

Hyderabad Cricket Association Amarnath HCA Jaganmohan Rao Hyderabad Cricket Justice Suresh Kumar Galaxy Club Sree Chakra Club Cricket Club Elections