తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని సిట్ చెప్పలేదు: టీజీ భరత్
- లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ నేతలు అవాస్తవాలు చెబుతున్నారన్న భరత్
- తప్పు చేసి.. కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు
- అసెంబ్లీలో ఈ అంశంపై చర్చిస్తామన్న మంత్రి
తిరుమలను కాపాడేది కూటమి ప్రభుత్వం మాత్రమేనని భరత్ చెప్పారు. తప్పు చేసి సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా శ్రీవేంకటేశ్వర స్వామి ముందుకు వచ్చి క్షమాపణలు కోరాలని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయంపై చర్చిస్తామని తెలిపారు. ఒకరోజు ముందే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లను పంపిణీ చేశామని చెప్పారు. దావోస్ పర్యటనలో ఏపీని అద్భుతంగా ప్రమోట్ చేశామని తెలిపారు. దీని అద్భుత ఫలితాలు త్వరలోనే కనిపిస్తాయని చెప్పారు.