అజిత్ పవార్ మరణం... బారామతి ప్రమాదంపై మరోసారి స్పందించిన రామ్మోహన్ నాయుడు
- బ్లాక్ బాక్స్ విశ్లేషణ కొనసాగుతోందన్న కేంద్రమంత్రి
- ఈ ప్రమాదం చాలా విషాదకరమన్న రామ్మోహన్ నాయుడు
- సురక్షిత ప్రయాణానికి తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడి
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణానికి కారణమైన బారామతి విమాన ప్రమాద దుర్ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మరోసారి స్పందించారు. ఈ ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్ విశ్లేషణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఈ ప్రమాదం చాలా విషాదకరమని అన్నారు.
మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సురక్షిత ప్రయాణానికి తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా-2026 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం బారామతి ప్రమాదంపై పైవిధంగా స్పందించారు.
కాగా, ఈ కార్యక్రమంలో ఉత్తమ విమానాశ్రయాలకు ఆయన అవార్డులను ప్రదానం చేశారు. ఢిల్లీ, బెంగళూరు, లక్నో విమానాశ్రయాలను అవార్డులు వరించాయి. కార్గో సర్వీసెస్‌లో ఉత్తమ అవార్డును ఎయిరిండియా సొంతం చేసుకుంది. వింగ్స్ ఇండియా కార్యక్రమంలో భాగంగా జీఎంఆర్ ఏవియేషన్ అకాడమీలో పైలట్ ట్రెయినింగ్, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజినీరింగ్ శిక్షణ ఎలా ఉంటుందని ప్రత్యక్షంగా చూపించే పైలట్ సిమ్యులేటర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.