: బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన అనిల్ రావిపూడి
- 'భగవంత్ కేసరి' తన కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైనదన్న అనిల్ రావిపూడి
- ఈ సినిమా ప్రీక్వెల్ లేదా సీక్వెల్ చేసే అవకాశం ఉందని స్పష్టీకరణ
- ప్రీక్వెల్ కథ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని వెల్లడి
టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో ఆయన తెరకెక్కించిన 'మన శంకర వరప్రసాద్ గారు' బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ చిత్రం రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ తన తదుపరి చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బాలకృష్ణతో తాను తెరకెక్కించిన 'భగవంత్ కేసరి' చిత్రానికి ప్రీక్వెల్ కానీ, సీక్వెల్ కానీ చేసే అవకాశం ఉందని అనిల్ తెలిపారు. బాలయ్య ఫ్యాన్స్ నుంచి వస్తున్న రిక్వెస్ట్ ల మేరకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తన కెరీర్ లో 'భగవంత్ కేసరి' ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు.
'భగవంత్ కేసరి' ప్రీక్వెల్ కథ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అనిల్ తెలిపారు. భగవంత్ కేసరి క్యారెక్టర్ పోలీసు అధికారిగా మారకముందు ఏం జరిగింది? ఆయన గత జీవితం ఏమిటి? అనే అంశాలు కథను మరో లెవెల్ కు తీసుకెళతాయని చెప్పారు. అనిల్ రావిపూడి చేసిన తాజా వ్యాఖ్యలతో బాలయ్య ప్యాన్స్ ఖుషీ అవుతున్నారు.