వర్క్ ఫ్రం హోం చేస్తుండగా గుండెపోటు.. అమెరికాలో తెలంగాణ వాసి మృతి
- పదేళ్లుగా ఫ్లోరిడాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న హర్షవర్ధన్ రెడ్డి
- వీపనగండ్ల మండలం బొల్లారం నుంచి అమెరికాకు వలస
- మృతుడికి భార్య, కుమారుడు.. తండ్రి బొల్లారం గ్రామ సర్పంచ్
అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న తెలంగాణ వాసి గుండెపోటుతో మరణించాడు. తన నివాసంలో వర్క్ ఫ్రమ్ హోం చేస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్లు సమాచారం. తెలంగాణలోని వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామానికి చెందిన హర్షవర్ధన్ రెడ్డి(45) అమెరికాకు వలస వెళ్లాడు.
గత పదేళ్లుగా ఫ్లోరిడాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. హర్షవర్ధన్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన తండ్రి సుదర్శన్‌రెడ్డి బొల్లారం గ్రామ సర్పంచ్ గా సేవలందిస్తున్నారు.
గత పదేళ్లుగా ఫ్లోరిడాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. హర్షవర్ధన్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన తండ్రి సుదర్శన్‌రెడ్డి బొల్లారం గ్రామ సర్పంచ్ గా సేవలందిస్తున్నారు.