భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా 'గూగుల్' ప్రత్యేక డూడుల్
- ఇస్రో సాధించిన విజయాలను సూచించేలా డూడుల్
- గగన్‌యాన్, చంద్రయాన్ వంటి ఇస్రో మిషన్లతో డూడుల్
- అంతరిక్షం, గ్రహాలు, కక్ష, ఉపగ్రహ నమూనాలతో డూడుల్
గూగుల్ రూపొందించిన డూడుల్‌లో అంతరిక్షం, గ్రహాలు, కక్ష, ఉపగ్రహ నమూనాలు ఉన్నాయి. వాటన్నింటినీ త్రివర్ణ పతాకంలోని రంగులతో రూపొందించింది. 'ఎల్' అక్షరాన్ని ఆకాశమే హద్దుగా నింగిలోకి దూసుకెళుతున్న రాకెట్‌గా తీర్చిదిద్దింది. ఈ డూడుల్ శాస్త్ర సాంకేతిక రంగంలో మన శాస్త్రవేత్తల విజయాన్ని ప్రతిబింబిస్తోంది.