దానిని ఇతరులపైకి నెట్టే ప్రయత్నం చేయను.. చిరంజీవి కీలక వ్యాఖ్యలు
- షూటింగ్‌లో చిత్ర బృందం మొత్తం ఒక కుటుంబంలా కలిసిపోతే ఆ ఎఫెక్ట్ కచ్చితంగా తెరపై కనిపిస్తుందన్న చిరంజీవి
- కొన్ని సినిమాలు మరింత జోష్‌ను ఇస్తాయని వ్యాఖ్య
- తప్పు ఏదైనా ఉంటే దానిని తనపైనే వేసుకుంటానన్న చిరంజీవి
సినిమా ఫలితాలపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మన శంకరవరప్రసాద్‌గారు'. ఇందులో నయనతార కథానాయికగా నటించగా, వెంకటేశ్ ఒక ముఖ్య పాత్ర పోషించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసి, రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విజయోత్సవ సభలో చిరంజీవి మాట్లాడుతూ, సినిమా చిత్రీకరణ సమయంలో చిత్ర బృందం మొత్తం ఒక కుటుంబంలా కలిసి పనిచేస్తే ఆ ప్రభావం తప్పకుండా తెరపై కనిపిస్తుందని, దీనిని తాను గట్టిగా విశ్వసిస్తానని అన్నారు. సినిమాలన్నీ తనకు సంతోషాన్ని కలిగిస్తాయని, అయితే ఇలాంటి చిత్రాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయని ఆయన పేర్కొన్నారు.
సినిమా ఫలితాల విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే దాని బాధ్యతను తానే తీసుకుంటానని, దానిని ఇతరులపైకి నెట్టే ప్రయత్నం చేయనని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా అన్ని సినిమాల కోసం ఒకే విధంగా శ్రమిస్తామని, ఇష్టంతోనే పూర్తి చేస్తామని, కానీ కొన్ని చిత్రాలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయే ఉత్సాహాన్ని ఇస్తాయని చిరంజీవి అన్నారు.