ధర్మేంద్రకు పద్మవిభూషణ్... మమ్ముట్టికి పద్మభూషణ్
- పద్మ పురస్కారాలు 2026: నోరి దత్తాత్రేయుడికి పద్మ భూషణ్
- అల్కా యాగ్నిక్‌కు పద్మ భూషణ్
- పలువురు ప్రముఖులకు అత్యున్నత గౌరవం
కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈ ఏడాది సినీ రంగానికి చెందిన ఇద్దరు దిగ్గజ నటులకు అరుదైన గౌరవం దక్కింది. దివంగత బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ (మరణానంతరం) లభించగా, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి పద్మ భూషణ్‌కు ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను గౌరవిస్తూ కేంద్రం ఈ జాబితాను విడుదల చేసింది.
పద్మ విభూషణ్ పురస్కారానికి మొత్తం ఐదుగురిని ఎంపిక చేయగా, వారిలో కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్. అచ్యుతానందన్‌కు కూడా మరణానంతరం ఈ గౌరవాన్ని ప్రకటించారు. ఇక పద్మ భూషణ్ పురస్కార గ్రహీతల్లో ప్రఖ్యాత గాయని అల్కా యాగ్నిక్, తెలుగు వారికి సుపరిచితులైన క్యాన్సర్ వైద్య నిపుణులు, ఎన్నారై డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, భారత టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఝార్ఖండ్ మాజీ సీఎం షిబు సోరెన్‌కు మరణానంతరం పద్మ భూషణ్ ప్రకటించారు.
ఈ ఏడాది మొత్తం 131 మందిని పద్మ పురస్కారాలు వరించాయి. ఇందులో 5 పద్మ విభూషణ్, 13 పద్మ భూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. కళలు, సామాజిక సేవ, సైన్స్, వాణిజ్యం, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఏటా ఈ పురస్కారాలను అందజేస్తారు. ఈసారి అవార్డు గ్రహీతల్లో 19 మంది మహిళలు, 6 మంది విదేశీ/ఎన్నారైలు ఉండగా, 16 మందికి మరణానంతరం ఈ గౌరవం దక్కింది. ఈ పురస్కారాలను మార్చి లేదా ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం చేస్తారు.
పద్మ పురస్కారాల గ్రహీతల జాబితా:
పద్మ విభూషణ్
1. ధర్మేంద్ర సింగ్ డియోల్ (మరణానంతరం) - కళలు - మహారాష్ట్ర
2. కె.టి. థామస్ - పబ్లిక్ అఫైర్స్ - కేరళ
3. ఎన్. రాజం - కళలు - ఉత్తర ప్రదేశ్
4. పి. నారాయణన్ - సాహిత్యం, విద్య - కేరళ
5. వి.ఎస్. అచ్యుతానందన్ (మరణానంతరం) - పబ్లిక్ అఫైర్స్ - కేరళ
పద్మ భూషణ్
1. అల్కా యాగ్నిక్ - కళలు - మహారాష్ట్ర
2. భగత్ సింగ్ కోష్యారీ - పబ్లిక్ అఫైర్స్ - ఉత్తరాఖండ్
3. కల్లిపట్టి రామసామి పళనిస్వామి - వైద్యం - తమిళనాడు
4. మమ్ముట్టి - కళలు - కేరళ
5. నోరి దత్తాత్రేయుడు - వైద్యం - యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
6. పీయూష్ పాండే (మరణానంతరం) - కళలు - మహారాష్ట్ర
7. ఎస్.కె.ఎం. మేలానందన్ - సామాజిక సేవ - తమిళనాడు
8. శతావధాని ఆర్. గణేష్ - కళలు - కర్ణాటక
9. శిబు సోరెన్ (మరణానంతరం) - పబ్లిక్ అఫైర్స్ - ఝార్ఖండ్
10. ఉదయ్ కొటక్ - వాణిజ్యం, పరిశ్రమలు - మహారాష్ట్ర
11. వి.కె. మల్హోత్రా (మరణానంతరం) - పబ్లిక్ అఫైర్స్ - ఢిల్లీ
12. వెల్లపల్లి నటేశన్ - పబ్లిక్ అఫైర్స్ - కేరళ
13. విజయ్ అమృత్‌రాజ్ - క్రీడలు - యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా