భారీ హిమపాతంలో వివాహ వేడుక.. వీడియో ఇదిగో!

  • రుద్రప్రయాగ్ లోని శివపార్వతుల వివాహం జరిగిన చోట ఒక్కటైన జంట
  • మీరట్ నుంచి ఉత్తరాఖండ్ కు వధూవరుల కుటుంబాలు
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
వివాహ వేడుకను సంప్రదాయబద్ధంగా, స్పెషల్ గా జరుపుకోవాలని భావించిన మీరట్ కు చెందిన జంట రుద్రప్రయాగ్ లోని ఓ ఆలయాన్ని వేదికగా ఎంచుకుంది. ఏర్పాట్లన్నీ చేసుకుని కుటుంబాలతో సహా ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ కు చేరుకుంది. అయితే, కొన్నిరోజులుగా ఉత్తరాఖండ్ లో హిమపాతం కారణంగా ఎక్కడ చూసినా తెల్లటి మంచు తప్ప మరేమీ కనిపించడంలేదు. ప్రతికూల వాతావరణం కారణంగా వివాహాన్ని వాయిదా వేసుకోవాలని బంధువులు సూచించినా ఆ జంట వినిపించుకోలేదు. "మంచు కురిసే వేళలో..." అని పాడుకుంటూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

ఈ వివాహానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వధూవరులు ఇద్దరూ మంచులో నడుస్తూ ఆలయానికి వెళ్లడం ఇందులో కనిపిస్తోంది. కాగా, వసంత పంచమి రోజు రుద్ర ప్రయాగ్ లోని త్రియుగినారాయణ్ టెంపుల్ లో ఈ వివాహం జరిగింది. పురాణాల ప్రకారం ఇక్కడే శివపార్వతుల వివాహం జరిగింది. ప్రతికూల వాతావరణంలో వివాహం చేసుకున్న ఆ జంట స్పందిస్తూ.. ఎట్టకేలకు తమకు ఆ పరమశివుడి ఆశీస్సులు లభించాయని సంతోషం వ్యక్తం చేశారు.


More Telugu News