రంజీ ట్రోఫీ: షమీ విజృంభణ.. నాకౌట్‌లో బెంగాల్

  • రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన బెంగాల్ జట్టు
  • సర్వీసెస్‌పై ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో ఘన విజయం
  • బౌలింగ్‌లో మహమ్మద్ షమీ ఐదు వికెట్లతో సత్తా
  • గ్రూప్-సీ టాపర్‌గా నాకౌట్ బెర్త్ ఖరారు చేసుకున్న బెంగాల్
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో బెంగాల్ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌లోకి ఘనంగా అడుగుపెట్టింది. సర్వీసెస్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్-సీ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి నాకౌట్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. పేసర్ మహమ్మద్ షమీ ఐదు వికెట్లతో చెలరేగి ఈ విజయంలో కీల‌క పాత్ర పోషించాడు.

బెంగాల్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 519 పరుగుల భారీ స్కోరు చేసింది. వెటరన్ బ్యాటర్ సుదీప్ ఛటర్జీ (209) డబుల్ సెంచరీతో ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సర్వీసెస్ తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో షమీ (5/51) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో చెలరేగడంతో సర్వీసెస్ 287 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో బెంగాల్‌కు బోనస్ పాయింట్‌తో సహా 7 పాయింట్లు లభించాయి. మొత్తం 30 పాయింట్లతో గ్రూప్-సీ టాపర్‌గా బెంగాల్ నాకౌట్ స్థానాన్ని పదిలం చేసుకుంది.


More Telugu News