భారత బ్యాడ్మింటన్ దశ దిశ మార్చిన క్రీడాకారిణి సైనా: ఏపీ మంత్రి నారా లోకేశ్

  • సైనా నెహ్వాల్‌పై మంత్రి నారా లోకేశ్ ప్రశంసల జల్లు
  • భారత బ్యాడ్మింటన్ గతిని మార్చిన క్రీడాకారిణి అని కితాబు
  • సైనా క్రీడా ప్రస్థానం యువతకు ఆదర్శమని వెల్లడి
  • ఆమె తదుపరి ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్ష
ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆట నుంచి వైదొలగిన సందర్భంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత క్రీడా రంగానికి ఆమె చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సైనా నెహ్వాల్ నిజమైన మార్గదర్శకురాలని, భారత బ్యాడ్మింటన్ దశ దిశను మార్చిన ఘనత ఆమెకే దక్కుతుందని లోకేశ్ పేర్కొన్నారు.

కేవలం తన పట్టుదల, అత్యుత్తమ ఆటతీరుతో భారత బ్యాడ్మింటన్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని మంత్రి ప్రశంసించారు. సైనా క్రీడా ప్రయాణం ఎంతోమంది భారతీయ యువతలో స్ఫూర్తి నింపిందని, పెద్ద కలలు కనేలా చేసిందని తెలిపారు. మైదానంలో భయం లేకుండా ఎలా పోటీపడాలో నేటి తర్వానికి ఆమె నేర్పించారని అన్నారు.

సైనా వదిలి వెళుతున్న ఈ గొప్ప వారసత్వానికి దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఆమె తన తదుపరి జీవితంలోనూ మరిన్ని విజయాలు సాధించాలని, భవిష్యత్తు సాఫీగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు నారా లోకేశ్ తన సందేశంలో వెల్లడించారు.


More Telugu News