హరీశ్ రావు విచారణ.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత
- జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు ర్యాలీగా బయలుదేరిన వెళ్లిన ఎమ్మెల్యేలు
- పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు
- పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట
బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు సిట్ విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీశ్ రావుకు నోటీసులు జారీ చేయడం కక్షపూరిత చర్య అని, రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీ కావాలనే విచారణ పేరుతో వేధిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, సంజయ్‌లు తెలంగాణ భవన్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ పోలీసులకు వ్యతిరేకంగా, హరీశ్ రావుకు అనుకూలంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు.
ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు, హరీశ్ రావు విచారణ ముగియనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వస్తున్నారు.