మల్లారెడ్డి గోల్డెన్ జూబ్లీ... కేసీఆర్ కు ఆహ్వానం
- బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఎమ్మెల్యే మల్లారెడ్డి భేటీ
- తమ 50వ వివాహ వార్షికోత్సవానికి ఆహ్వానం
- ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందజేసిన మల్లారెడ్డి
- మల్లారెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
ఈ నెల 19వ తేదీన జరగనున్న తమ గోల్డెన్ జూబ్లీ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికను మల్లారెడ్డి దంపతులు.. కేసీఆర్ దంపతులకు అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్, మల్లారెడ్డి దంపతులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.