పార్టీ ఫిరాయింపు వ్యవహారం.. దానం నాగేందర్ విషయంలో కొనసాగుతున్న టెన్షన్

  • మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్
  • మరో ముగ్గురు ఎమ్మెల్యేల విషయం పెండింగ్ లో ఉన్న వైనం
  • తాను కాంగ్రెస్ లో ఉన్నానని ఇప్పటికే ప్రకటించిన దానం
పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్యలు పార్టీ మారారని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని స్పీకర్ ప్రకటించారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్టు ఆయన తెలిపారు.

 మరోవైపు మరో ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారం పెండింగ్ లో ఉంది. త్వరలోనే వీరి విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీరిలో దానం నాగేందర్ ఒకరు. దానం విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే టెన్షన్ సర్వత్ర నెలకొంది. ఎందుకంటే, తాను బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినట్టు దానం బహిరంగంగా చెబుతున్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఉపఎన్నికను ఎదుర్కోవడానికి తాను సిద్ధమని తెలిపారు. ఈ క్రమంలో, ఇదే విషయాన్ని స్పీకర్ కు చెబితే ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది.


More Telugu News