భారత్ లోని గ్రామాలకు నేపాల్ టెలికాం సిగ్నల్స్... ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు
- ఉత్తరాఖండ్ లోని ఫిథౌరాగఢ్ జిల్లా సరిహద్దు గ్రామాల్లో సిగ్నల్స్ సమస్య
- దాదాపు 78 గ్రామాలకు సమస్య
- మొబైల్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నామన్న జిల్లా కలెక్టర్
ఉత్తరాఖండ్ లోని పిథౌరాగఢ్ జిల్లా సరిహద్దు గ్రామాల్లో మొబైల్ సిగ్నల్స్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. నేపాల్ సరిహద్దుకు సమీపంగా ఉన్న ఈ గ్రామాల్లో భారతీయ టెలికాం కంపెనీల సిగ్నల్స్ బదులు నేపాల్ టెలికాం సిగ్నల్స్ వస్తున్నాయి. దీనివల్ల గ్రామీణులు వీడియో కాల్స్, గ్యాస్ బుకింగ్, ఆన్‌లైన్ విద్య వంటి సేవలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ చౌహాన్ మాట్లాడుతూ... సిగ్నల్ సమస్యపై మొబైల్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు.
పిథౌరాగఢ్ జిల్లాలో దాదాపు 78 సరిహద్దు గ్రామాలు సిగ్నల్స్ సమస్యతో ఇబ్బందిపడుతున్నాయి. జిల్లా కేంద్రం నుంచి 18-20 కి.మీ. దూరంలోని ఈ గ్రామాల్లో భారతీయ టవర్లు తక్కువగా ఉండటం వల్ల నేపాల్ సిగ్నల్స్ డామినేట్ చేస్తున్నాయి. దీని వల్ల సెక్యూరిటీ రిస్క్‌లు పెరుగుతున్నాయి. విద్యార్థుల ఆన్‌లైన్ చదువులకు ఆటంకం కలుగుతోంది. గ్యాస్ బుకింగ్స్ వంటి వాటికి ఇబ్బంది పడాల్సి వస్తోంది.