దారంలేని రంగురంగుల రిమోట్ పతంగిని తయారు చేసిన సూరత్ యువ పరిశోధక బృందం

  • రిమోట్ కంట్రోల్ పతంగిని తయారు చేసిన విక్కీ వఖారియా బృందం
  • ఇది గాల్లోకి ఎగరడానికి గాలి కూడా అవసరం లేదు
  • రాత్రి సమయాల్లో రంగురంగుల ఎల్ఈడీ లైట్లతో వెలుగులు
సంక్రాంతి పండుగ అనగానే బాలబాలికలు, యువతీయువకులకు పతంగులు గుర్తుకు వస్తాయి. పతంగులు ఎగురవేసేందుకు చాలామంది చైనా మాంజాను వినియోగించడం వల్ల ఎందరో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సాధారణ దారాన్ని వాడాలని పలువురు సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూరత్‌కు చెందిన యువ పరిశోధకుడు విక్కీ వఖారియా, ఆయన బృందం ఒక వినూత్న ఆవిష్కరణను రూపొందించింది.

విక్కీ వఖారియా, ఆయన బృందం రిమోట్ కంట్రోల్ పతంగిని తయారు చేశారు. దీనికి ఎగరడానికి గాలి కూడా అవసరం లేదు. వారు రూపొందించిన పతంగి గాలిలో గింగిరాలు తిరుగుతూ రాత్రి వేళల్లో రంగురంగుల ఎల్ఈడీ లైట్లతో వెలుగులు విరజిమ్ముతుంది. ఈ పతంగిని భారత్‌లో అంతర్జాతీయ పతంగుల వేడుకతో పాటు ఇండోనేషియా, సింగపూర్, చైనాల్లో విక్కీ బృందం ప్రదర్శించి బహుమతులు గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఈ సాంకేతికతను వివరించే అవకాశం వీరికి లభించింది.


More Telugu News