వీధి కుక్కల దాడిలో ఎవరైనా గాయపడితే వాటికి తిండిపెట్టిన వారిదే బాధ్యత: సుప్రీంకోర్టు

  • అంత ప్రేమ ఉంటే ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవాలని సూచన
  • రాష్ట్ర ప్రభుత్వాలే పరిహారం చెల్లించాలని హెచ్చరిక
  • చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు బాధ్యత వహించాల్సిందే
వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చిన్న పిల్లలు, వృద్ధులపై వీధి కుక్కలు దాడిచేసి గాయపరిస్తే.. వాటికి తిండి పెడుతున్న వారిదే బాధ్యత అని స్పష్టం చేసింది. వీధి కుక్కలపై అంత ప్రేమ ఉంటే వాటిని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవాలని సూచించింది.

వీధి కుక్కల విషయంలో తమ ఆదేశాలను పాటించని రాష్ట్ర ప్రభుత్వాలపైనా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గాయపడ్డ వారికి పరిహారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లించాలని స్పష్టం చేసింది. చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు తాము నిర్దేశించిన పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందని జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌ హెచ్చరించారు.


More Telugu News