ఇస్రో రాకెట్ ప్రయోగం విఫలం
- సమస్యను విశ్లేషిస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలు
- నిర్ణీత సమయానికి నింగికెగిరిన పీఎస్ఎల్వీ– సీ62
- రెండు దశల పాటు సాఫీగా సాగిన రాకెట్ ప్రయాణం
దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన ‘ఈఓఎస్-ఎన్1’ లేదా ‘అన్వేష’ ఉపగ్రహంతో పాటు భారత్, యూకే, థాయ్‌లాండ్, బ్రెజిల్, స్పెయిన్, నేపాల్ తదితర దేశాలకు చెందిన మరో 14 చిన్న ఉపగ్రహాలను కూడా ఈ రాకెట్ మోసుకెళ్లింది. అత్యంత కీలకమైన ‘అన్వేష’ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు చేపట్టిన రాకెట్ ప్రయోగం విఫలం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో నిరాశ వ్యక్తమవుతోంది. కాగా, 2025 మే 18న ప్రయోగించిన పీఎఎస్ఎల్వీ – సీ61 రాకెట్ ప్రయోగం కూడా ఇదేవిధంగా మూడో దశలోనే విఫలమైంది. ఈ ప్రయోగంలో జరిగిన తప్పొప్పులను నిశితంగా పరిశీలించి, పొరపాట్లను సరిదిద్దుకున్నాక చేపట్టిన తాజా ప్రయోగం కూడా ఫెయిలైంది.