అమెజాన్‌లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్... ఎప్పటి నుంచి అంటే...!

  • ‘గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ 2026’ను జనవరి 16న ప్రారంభించనున్నట్లు ప్రకటించిన అమెజాన్ 
  • ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం వరకు డిస్కౌంట్‌ అందించనున్నట్లు వెల్లడి 
  • జనవరి 17నుంచి తన సేల్‌ను ప్రారంభించనున్నట్లు ముందుగా ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరో భారీ సేల్‌కు సిద్ధమైంది. ఇటీవలే ఫ్లిప్‌కార్ట్ సేల్ తేదీలను ప్రకటించగా, తాజాగా అమెజాన్ కూడా ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’ను అధికారికంగా ప్రకటించింది. ఈ సేల్ జనవరి 16 నుంచి ప్రారంభం కానుంది.

సేల్ సందర్భంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు అమెజాన్ తెలిపింది. పూర్తి డీల్స్ వివరాలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.

ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, పీసీలు, గేమింగ్ కన్సోల్స్, స్మార్ట్ గ్లాసెస్, వాషింగ్ మెషీన్లు, ప్రొజెక్టర్లు, స్మార్ట్ టీవీలపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి.

ఇదిలా ఉండగా, ఫ్లిప్‌కార్ట్ జనవరి 17 నుంచి తన సేల్‌ను ప్రారంభించనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ మెంబర్లకు 24 గంటల ముందుగానే యాక్సెస్ కల్పించనుంది. దీంతో ఈ పండగ సీజన్‌లో దేశంలోని రెండు అగ్ర ఈ-కామర్స్ దిగ్గజాల మధ్య మరోసారి గట్టి పోటీ నెలకొననుంది. 


More Telugu News