మాజీ ఐపీఎస్‌ వీకే సింగ్‌ ఇంటిపై దాడికి యత్నం

  • జూబ్లీహిల్స్ లోని వీకే సింగ్ నివాసం వద్ద దుండగుడు హల్ చల్
  • సెక్యూరిటీ నుంచి వెపన్ లాక్కునేందుకు యత్నం
  • నిందితుడిని పట్టుకున్న ఇతర సెక్యూరిటీ సిబ్బంది
మాజీ ఐపీఎస్ అధికారి వీకే సింగ్ ఇంటి వద్ద ఒక దుండగుడు హల్ చేశాడు. హైదరాబాద్ లోని ఆయన నివాసంపై దాడికి యత్నించాడు. నిన్న అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది నుంచి వెపన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన ఇతర సెక్యూరిటీ సిబ్బంది నిందితుడిని పట్టుకున్నారు. 

దీనిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని తర్ఫీజ్ గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


More Telugu News