‘‘నేను ఇంకెన్నాళ్లు జీవించి ఉంటానో తెలీదు..” ట్రంప్ భావోద్వేగం
- మార్-ఎ-లాగో ఘటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు
- తనపై చాలామంది కన్నేశారంటూ నిర్వేదం
- గొప్ప నాయకులకే ఇలాంటి ముప్పు ఉంటుందని వ్యాఖ్య
వైట్ హౌస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్.. ‘‘నేను ఇంకా ఎంతకాలం ఇక్కడ (జీవించి) ఉంటానో నాకు తెలియదు. నా కోసం తుపాకులు పట్టుకుని ఎంతమంది వేచి చూస్తున్నారో చూశారుగా?’’ అని వ్యాఖ్యానించారు. గొప్ప నాయకులకే ఇలాంటి ముప్పు ఉంటుందని, అబ్రహం లింకన్, కెన్నడీ వంటి ‘ప్రభావశీల’ అధ్యక్షులనే లక్ష్యంగా చేసుకుంటారని ఆయన గుర్తుచేశారు. ‘‘బహుశా నేను కొంచెం తక్కువ ప్రభావశీల నాయకుడిగా ఉంటే బాగుండేదేమో.. కాసేపు సాధారణ అధ్యక్షుడిలా ఉందాం’’ అని చమత్కరించారు.
అసలేం జరిగింది..
గతంలోనూ ట్రంప్ పై హత్యాయత్నం..
ఆ సమయంలో ట్రంప్ దంపతులు వైట్ హౌస్‌లో ఉన్నారు. గతంలో కూడా ట్రంప్‌పై రెండుసార్లు హత్యాయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. తాజా ఘటనలో చనిపోయిన యువకుడు ఎప్ స్టీన్ ఫైల్స్ విడుదలకు సంబంధించి ప్రభుత్వంపై అసహనంతో ఉన్నట్లు కొన్ని టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా వెల్లడైంది.